

★పిల్లలతో ఫోటోలు నిషేధం. ★విద్యార్థి సంఘాలకు చెంప దెబ్బ. ★ఇది చెత్త జీవో – వైసిపి విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ రెడ్డి.
ఉరవకొండ మన జన ప్రగతి ఆగస్టు 3: రాజకీయ చిహ్నాలు, పార్టీ జెండాలు పెట్టుకుని పాఠశాలలోకి వస్తే ఏంటి పరిస్థితుల్లో అనుమతించ వద్దంటూ పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అనధికార వ్యక్తులకు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదంటూ ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామ రాజు విద్యాశాఖ అధికారులకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు మినహా ఎవ్వరిని అనుమతించ కూడదంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన
రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశా ప్రధానోపాధ్యాయుల ముందస్తు అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు మరియు గుంపులు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు విద్యా డైరెక్టర్ దృష్టికి రావటంతో ఈ మేరకు ఆయన చర్యలు చేపట్టారు.
విద్యార్థులకు లేదా పాఠశాలకు బహుమతులు,విరాళాలు ఇవ్వడంకోసం కూడా ఇలా అనధికార ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ విధమైన ప్రవేశాలు పాఠశాలల బోధన ప్రక్రియకు పెద్ద అంతరాయంగా మారుతున్నాయని ఆరోపించారు.
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు మరియు విద్యా బోధనలో అంతరాయం లేకుండా కొనసాగించేందుకు తక్షణమే ఆయన 30/67/2025 ఉత్తర్వులను ఆగస్టు ఒకటో తేదీన అమలులోకి వచ్చే వచ్చే విధంగా ఆదేశాలు మంజూరు చేశారు.. పరిమిత ప్రవేశం :
తల్లిదండ్రులు మరియు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు తప్ప ఇతర ఎవరూ పాఠశాలలోకి ప్రవేశించడానికి అనుమతించరాదంటూ
ఎవైనా విరాళాలు లేదా పదార్థాలు ఇవ్వదలిస్తే, అవి తలుపు వద్ద ప్రధానోపాధ్యాయునికి మాత్రమే ఇవ్వాలి.
పిల్లలతో మాట్లాడటం లేదా తరగతుల్లోకి ప్రవేశించడం నిషేధించబడింది.
పిల్లలతో ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధించబడింది.
. ఫిర్యాదుల పరిష్కారం:
ఏవైనా ఫిర్యాదులు, వినతులు, అభ్యర్థనలు ఉంటే, అవి పాఠశాల పరిపాలనా కార్యాలయానికి మాత్రమే ఇవ్వాలి.
బాహ్య వ్యక్తులు లేదా సంస్థలతో విద్యార్థులు మరియు సిబ్బంది నేరుగా సంప్రదించకూడదు.
.రాజకీయ చిహ్నాల నిషేధం :
రాజకీయ పార్టీలు లేదా సంస్థలకి చెందిన జెండాలు, షాల్లు, బ్యానర్లు లేదా పోస్టర్లు వంటి రాజకీయ చిహ్నాలు పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించడం నిషేదిస్తూ విద్యా డైరెక్టర్ విజయరామరాజు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయించాలి.
ఏవైనా ఉల్లంఘనలు ఉంటే, వెంటనే డైరెక్టర్ దృష్టికి తీసుకు రావాలని విజయరామరాజు కోరారు.
విద్యా సంఘాలకు పెద్ద చంప దెబ్బ : విద్యా డైరెక్టర్ పంపిన ఉత్తర్వులు విద్యార్థి సంఘాలకు పెద్ద ఎత్తున చెంప దెబ్బ. ఆ సంఘాల నాయకులకు ముకుతాడు వేయటానికే ఈ ఉత్తరువు తెచ్చినట్లు తెలుస్తోంది. పాఠశాలలోకి గుంపులుగా ప్రవేశ అనుమతి లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుని ముందస్తు అనుమతి తప్పనిసరి. తల్లిదండ్రులు కమిటీ సభ్యులు కానీ వ్యక్తులు కనుక ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. మధ్యాహ్న భోజన పరిశీలన, మౌలిక సదుపాయాల ఆరా తీసే అవకాశం లేకుండా పోతుంది. అందుకే ఈ ఉత్తర్వును విద్యార్థి సంఘం నాయకులు చెత్త ఉత్తరువుగా పేర్కొన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.