

ఉరవకొండ మన :ఆగస్టు 4,5,6 తేదీలలో నంద్యాల నగరంలో జరుగు పీ డీ ఎస్ యూ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ పిలుపునిచ్చారు..
ఆదివారం స్థానిక కణేకల్ డివిజన్ పీడీ ఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆయన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా
జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకంగా విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం కోసం నంద్యాల నగరంలో జెకె ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్ర క్లాసులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతి నిధులు హాజరైతున్నారని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ, కాసాయికరణ చేయడానికి సిద్ధమైందని అన్నారు.
విదేశీ విశ్వవిద్యాలయంలను దేశంలోకి ఆహ్వానిస్తూ యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను మూసివేసే జీవో 19,20 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. యువగళ o పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు నారా లోకేష్ గారు తక్షణమే అమలు చేయాలని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసే జీవో నెంబర్ 77ను ఎప్పుడు రద్దు చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరలు అనుగుణంగా మేస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నంద్యాల నగరంలో జరుగు రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులు జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ కణేకల్ మండలం అధ్యక్షులు మహీంద్రా, నాయకులు హరి కృష్ణ, సురేష్, మహీంద్రా, పవన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు,