

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఉదయగిరి నియోజకవర్గానికి 696స్పౌజ్ పెన్షన్లు మంజూరైనట్లు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలిపారు. శుక్రవారం దుత్తలూరు మండలం ఏసీ కాలనీ నందు స్పౌజ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని అవ్వ తాతలకు, అక్క చెల్లెమ్మలకు పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల మౌలిక సమస్యలను తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి 696స్పౌజ్ పెన్షన్లు మంజూరయ్యాయని, ప్రజల వద్ద నుండి వచ్చిన వినతులను అధికార యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 696స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని మండలాలు వారిగా దుత్తలూరు మండలానికి 66 జలదంకి మండలానికి 122 కలిగిరి మండలానికి 116 కొండాపురం మండలానికి 103, సీతారాంపురం మండలానికి45, ఉదయగిరి మండలానికి 82, కొండాపురం మండలానికి62, వింజమూరు మండలానికి 100, పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం నుండి ఇప్పటివరకు భర్త చనిపోయిన వారు ఎంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, భర్త పెన్షన్లను భార్యలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉండేల గురువారెడ్డి, సీనియర్ నాయకులు చీకుర్తి రవీంద్రబాబు, పాముల సుబ్బరాయుడు, చిదర్ల మల్లికార్జున, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, శనివారపు వెంకటేశ్వర్లు రెడ్డి ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.