

మన న్యూస్,తిరుపతి :
తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని కలంకారి శాలువతో సత్కరించి శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని శ్రీశైలం శ్రీకాళహస్తి తో పాటు ఇతర ఆలయాలలో, టూరిజం రిసార్ట్స్ లలో హ్యాండీక్రాప్ప్స్ స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరామన్నారు. అరకు విశాఖపట్నం గండికోట శ్రీశైలం లలో ఉన్న టూరిజం రిసార్ట్స్ లలో లేపాక్షి కౌంటర్లను ఉచితంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ సుముకుత వ్యక్తం చేసినట్లు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.