

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు జాతీయ సేవా పథకం ఆద్వర్యంలో చట్టాల పై అవగాహన అనే సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి చట్టాల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు, ప్రస్తుతం జరుగుతున్న మోసాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ భూమి పై ఉండే ప్రతి మనిషికి సమాన న్యాయం మరియు స్వతంత్రంగా బ్రతికే హక్కు ఉందని, చట్టాల పై అవగాహన లేని వారికి విద్యార్దులైన అవగాహన కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి జుడీష్యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లంకా గోపినాథ్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు మాట్లాడుతు గర్బాస్థ శిశువు నుంచి మరణించేవరకు అనేక చట్టాలు ఉన్నాయని కాకపోతే ఈ చట్టాల పై అందరికీ అవగాహన ఉండడం లేదని, చట్టాల పై అందరికీ అవగాహన కలిగించడం వల్ల అనేక మందికి న్యాయం జరుగుతుందని, విద్యార్డులకు, ర్యాగింగ్, లైంగిక ఇబ్బందులు, మత్తు పదార్డల రవాణ, డ్రైవింగ్ లైసెన్స్,మొదలైన అంశాలలో జరిగే ఇబ్బందుల గూర్చి వివరించారు. విద్యార్దలంతా చట్టాల పై అవగాహన ఏర్పరుచుకొని,తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలని అన్నారు. విద్యార్థులు బాగా కస్టపడి చదివి ఉన్నత శిఖరాలు అదిరోహించి కన్న వారికి సమాజనికి మంచి పేరు తేవాలని కోరారు.
ఏలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా లో కొంత మంది నేరగాలు అమాయకులైన వారిని ఉపయోగించుకొంటున్నారని విద్యార్దులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా అపరిచితులు వ్యక్తులు ఉంటే సంబందిత పోలీసు స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని కోరారు.సీనియర్ అడ్వకటే సుగుణ ర్యాగింగ్ వల్ల జరిగే అనర్దాలను,తద్వారా వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులు,సమాజంలో జరిగే అనేక అంశాల గూర్చి తెలియజేశారు.కాలీ ప్రోంసరి నోట్ పై,అదే విధంగా కాలీ చెక్ ల పై సంతకాలు చేసి ఎవరికి ఇవ్వొద్దు అని దాని వల్ల కలిగే అనర్దాల గూర్చి విద్యార్డులకు తెలియజేశారు.
కార్యక్రమంలో పానెల్ అడ్వకేట్ అవసరాల దేవి,వైస్ ప్రిన్సిపల్ కె వేంకటేశ్వర రావు,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ప్రయాగ మూర్తి ప్రగడ,అధ్యాపకులు కె సురేష్,మదీనా,శివ ప్రసాద్,లక్ష్మి,వీరభద్ర రావు,బంగార్రాజు,కుమారి మేరీ రోజలీనా,పుష్పా, సతీష్,రాజేశ్,పానెల్ అడ్వకటే శివ,నాగేంద్ర,రత్న కుమారి,ప్రసాద్,కళాశాల సిబ్బంది,పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.