

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
కాపు ఉద్యమ నేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని యర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు.గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద, ఏలేశ్వరం మండల పార్టీ,నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్,సిడగం వెంకటేశ్వరరావు,
వైసిపి పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.నూట ఒక్క (101) కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు,సామతుల సూర్య కుమార్,గొల్లపల్లి కాశి,ఓలేటి చంటిబాబు,పసల నాగేశ్వరరావు,గుమ్ములూరి వెంకట రమణ,జువ్విన వీరాజు,వాగు బలరాం,గల్లంపూడి గంగాధర్,బుద్దా నానాజీ, నాగేశ్వరరావు,నీరుకొండ అర్జున, పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు.