

శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల వీర వెంకట సత్యనారాయణ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు బుధవారం కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో సత్యనారాయణ ను పరామర్శించారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ని వైద్యులును అడిగి తెలుకొని సత్యనారాయణ కు మెరుగైనవైద్యం అందించాలని ముద్రగడ గిరిబాబు కోరారు. సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.