రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

మన న్యూస్ సింగరాయకొండ:-
– సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి మరియు సింగరాయకొండ రైతు సేవా కేంద్రాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మల కుమారి మాట్లాడుతూ, రైతు సోదరులు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి శ్రీ టి. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, రసాయనిక ఎరువుల బదులు సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నేల ఆరోగ్యం మెరుగవుతుందని, సాగు ఖర్చు తగ్గి లాభం పెరుగుతుందని తెలిపారు. వరి పంటలో సస్యరక్షణ చర్యలు, ఎరువుల వినియోగం, వ్యవస్థాపిత యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు.అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మినుము మరియు నువ్వు పంటలకు ఈనెల 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్, గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రియాంక, సాజిద్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Related Posts

ఘనంగా గురుపూజోత్సవం – వైభవంగా సత్యనారాయణ వ్రతం

మన న్యూస్,తిరుపతి జూలై 10: వ్యాస పౌర్ణమి గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరు సమీపం నందనవనం దత్తాత్రేయపురం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గురువారం ఉదయం ఆలయ వ్యవస్థాపకులు ఆచార్య కందమూరు శేషయ్య ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా దత్తాత్రేయ…

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ‌ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ‌పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-10 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఘనంగా గురుపూజోత్సవం – వైభవంగా సత్యనారాయణ వ్రతం

ఘనంగా గురుపూజోత్సవం – వైభవంగా సత్యనారాయణ వ్రతం

మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు

మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ‌ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ‌పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ‌ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ‌పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

జోరుగా సాగుతున్న ఇందిరా మహిళా శక్తి కళా యాత్ర. మహిళా మణులను ఆలోచింపచేస్తున్నా కళాకారుల పాటలు

జోరుగా సాగుతున్న ఇందిరా మహిళా శక్తి కళా యాత్ర. మహిళా మణులను ఆలోచింపచేస్తున్నా కళాకారుల పాటలు

విద్యార్థులు చిన్నప్పటినుంచే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలి….రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

విద్యార్థులు చిన్నప్పటినుంచే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలి….రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

బాబా దర్శనంతో భక్తుల్లో మానసిక ప్రశాంతత…

బాబా దర్శనంతో భక్తుల్లో మానసిక ప్రశాంతత…