పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కట్టడం సరైనదేనా? గద్వాల జిల్లా ప్రాంత బడుగు పిల్లల ఆశ మాయమవుతుందా?

జూన్ 23, జోగులాంబ గద్వాల | మన న్యూస్ ప్రతినిధి
బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? ఐజ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణం పై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా గౌరవనీయ కలెక్టర్ గారికి ఓ ముక్త కంఠ వినతిపత్రాన్ని అందించారు. విద్యార్థులు చదువుకునే ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ నిర్మించడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు వివరంగా చర్చకు వస్తున్నాయి:

  1. పిల్లలకు ప్రమాదం జరగవచ్చు – చిన్నపిల్లలు ట్యాంక్ పైకి ఎక్కడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులు.
  2. మొక్కలు ధ్వంసం అవుతాయి – పాఠశాల గ్రీన్ కవర్ నశనం. స్కూల్ గ్రౌండ్ పూర్తిగా పాడవుతుంది.
  3. నిర్మాణం నడుస్తున్న సమయంలో తరగతులకు అంతరాయం.ట్యాంక్ నిండిన నీటి వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెయ్యడం – ఆరోగ్య సమస్యలు.భవిష్యత్తులో ట్యాంక్ బలహీనమవడం వల్ల ప్రమాదం – అలంపూర్ నియోజకవర్గంలో ఇదే తరహాలో ఓ పాత ఘటన కూడా ఉదాహరణగా చెబుతున్నారు.

పాఠశాల అనేది కేవలం భవనం కాదు – గ్రామ ప్రజల ఆశ. లక్షల రూపాయలు వెచ్చించలేని పేద ప్రజల పిల్లల ఆశయం. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రాంగణంలో ట్యాంక్ నిర్మించడం తప్పని, ఇతర ప్రాంతంలో నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థుల భద్రత కోసం, గ్రామ భవిష్యత్తు కోసం, సమాజం కోసం అధికారులు, నాయకులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ నిర్మాణంపై పునరాలోచించాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!