

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 23 :– జోగులాంబ గద్వాల జిల్లాధరూర్: మండల పరిధిలోని నీలహళ్లి గ్రామంలో బోయ రంగస్వామి అనే వృద్ధుడు గత కొంతకాలంగా పక్షవాయితో బాధపడుతున్నాడు. అయితే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు తనకు తోడుగా లేకపోవడంతో భార్యాభర్తలు జీవనం గడుపుతున్నారు. తనకున్న వ్యాధి కారణంగా ప్రతినెల ట్యాబ్లెట్లకు ఇతర ఖర్చులకు ఇబ్బందికరంగా మారిందని బోయ రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య చేసిన కూలి డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నామని ప్రభుత్వం తమకు పెన్షన్ మంజూరు చేయాలని ఆయన కోరారు.