రైతులకు పెట్టుబడి భరోసా – రూ140.07 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ

గద్వాల జిల్లా మన న్యూస్. రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అభివృద్ధినే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద,వానాకాలం సాగు ప్రారంభానికి ముందే గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న,సన్నకారు రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ చేసిందని తెలిపారు.ఈరోజు గురువారం సాయంత్రం వరకు నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన 1,35,024 మంది రైతులకు 140 కోట్లు 7 లక్షల 76 వేల 525 రూపాయలు సాయం అందించబడిందని తెలిపారు.ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం వల్ల వారు ఎలాంటి ఆలస్యం లేకుండా విత్తనాలు, ఎరువులు,కూలీల ఖర్చులు మొదలైన అవసరాలను తీర్చుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. రైతుల బ్యాంక్ ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులు రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయడం,వారి భూ వివరాలను అనుసరించి అర్హత గలవారికి నిధులను విడుదల చేయడం వంటి ప్రక్రియలు సమర్థంగా నిర్వహించబడినట్టు తెలిపారు.మిగిలిన రైతుల ఖాతాల్లోనూ త్వరలోనే నిధులు జమ చేయబడతాయన్నారు.రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ పథకం రైతులకు కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా స్థిరత్వాన్ని ఇస్తోందని,ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. విత్తనాలు వేసే ముందే సాయం అందడం వల్ల రైతులు అప్పుల ఊబిలో పడకుండా సాగు చేసే అవకాశం లభిస్తుందని,ఇది వ్యవసాయ ఉత్పాదకతను మరింత పెంపొందించగలదని అన్నారు.ప్రతి ఎకరాకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు. ఇది కేవలం నిధుల పంపిణీ మాత్రమే కాదు – రైతన్నలపై ప్రభుత్వం ఉంచిన విశ్వాసానికి నిదర్శనం,” అని కలెక్టర్ స్పష్టం చేశారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!