తెలంగాణ లో అభివృద్ధి కేంద్రప్రభుత్వానిదే..కాంగ్రెస్ పార్టీ దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదు..11 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం అద్భుతాలు చేసింది.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19 : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మెలచెర్వు గ్రామంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల అమృతకాల సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ..11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి దేశానికి స్వర్ణ యుగాన్ని తెచ్చింది అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వము కీలక పాత్ర పోషిస్తుందని, గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నాయనిఅన్నారు..నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల లో ఎవరు ఊహించని విధంగా దేశంలో అద్భుతమైన సుపరిపాలనను అందించి దేశాన్ని వికసిత భారత్ గా మలిచేందుకు అనేక రకాలైన చట్టాలను తయారు చేసిందని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద 12 కోట్ల టాయిలెట్ల నిర్మాణము, ఉజ్వల పథకం కింద 10 కోట్ల ఉచిత సిలిండర్ పంపిణీ, ఉచిత బియ్యం పంపిణీ, భీమా సేవలు, డిజిటల్ ఇండియా లో భాగంగా అందరికీ అకౌంట్లు, రోడ్లు, రైల్వేల అభివృద్ధి, ఉచిత కరోనా టీకాలు, ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన కింద అందరికీ పక్కా ఇండ్లు, ఇంటింటికి కులాయి నీళ్లు, విద్యుత్ వ్యవస్థ బలోపేతం, కిసాన్ సమ్మన్ నిధి, ఫసలు బీమా యోజన, పంటలకు మద్దతు ధరల పెంపు, కాశ్మీర్ 370 ఆర్టికల్ తొలగింపు, ముస్లిం మహిళల రక్షణ కోసం త్రిపుల్ తలాక్ చట్టం, రామ మందిర నిర్మాణం, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, రక్షణ రంగ బలోపేతము, సంబంధాలు, ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం అనేక రకాలైన చట్టాలను తీసుకువచ్చి తద్వారా 2047వ సంవత్సరం వరకు ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారత్ ను నిలిపేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అక్కల రమాదేవి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నరేష్ గౌడ్, బిజెపి మహిళ మోర్చా శోభారాణి,బద్రి , గ్రామ ప్రజలు హాజరయ్యారు..

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..