మన న్యూస్ ఐరాల జూన్-14

కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో సామాన్య భక్తుడిగా వ్రతానికి హాజరైన ఆయన, సాధారణ భక్తులతో కలిసి క్రింద కూర్చుని వ్రతంలో పాల్గోన్నారు. అనంతరం సంకటహర చతుర్ధి వ్రతం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్న అనంతరం ప్రధాన ఆలయంలో శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తుల పల్లకిని తన భుజాలపై ఆయన మోసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “సంకటహర చతుర్ధి వ్రతం మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి శాంతి, సంతోషాలను కలిగిస్తుందన్నారు. భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మనలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచుల కిషోర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *