ఎస్ఆర్ పురం, మన న్యూస్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని బికేఎన్ మునివర్ధనాయుడు శాలవతో సన్మానించి సత్కరించారు.. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడుని ఎస్ఆర్ పురం మండలం టిడిపి సీనియర్ నాయకుడు బి కే ఎన్ మునివర్ధనాయుడు మర్యాదపూర్వకంగా కలిసి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ మామిడి రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రికి తెలియజేశారు అలాగే ఎస్ఆర్ పురం మండలానికి వేరుశనగ విత్తనాలు తక్కువగా వచ్చాయని రైతులు వేరుశెనగ విత్తనాలు చాలక ఇబ్బంది పడుతున్నారని వేరుశెనగ రైతులకు సరిపోయే విధంగా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు కి బికేయన్ మునివర్ధనాయుడు తెలియజేయడంతో మంత్రి అచ్చం నాయుడు సానుకూలంగా స్పందించి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *