జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్. మన న్యూస్ :- వుడ్ షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అండర్9 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో చెలూరి శాన్వీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది..
ఫైనల్ మాచ్ లో ప్రియా మీద 21/19 స్కోర్ తో పోరాడి గెలిచింది మరియు యు11 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో తమ మ్యాచ్ పాయింట్ క్రీడాకారిని సహస్ర మీద పోరాడి 22/17 స్కోర్ తో సెమీ ఫైనల్ లో ఓడిపోయి ఫైనల్ లో పాల్గొనే అవకాశం చేజార్చుకుంది…యు11 గర్ల్స్ సింగిల్స్ ఫైనల్స్ 22/12 స్కోర్ తో సహస్ర గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది… యు11 బాయ్స్ సింగిల్స్ సజయ్ తేరుపల్లి అద్భుతమైన ఆటతో సెమి ఫైనల్లో 24/22 స్కోర్ తో గెలిచి ఫైనల్ చేరుకుని ఫైనల్లో తనీష్ మీద 21/19 స్కోర్ తో గెలిచి గోల్డ్ మెడల్ సాధించాడు.
యు11 బాయ్స్ డబుల్స్ విభాగంలో సజయ్ తెరుపల్లి, శ్రీలికిత్ జోడి ఫైనల్లో 22/20 తో పోరాడి ఓడిపోయారు. సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీ, సర్టిఫికెట్ లు బహుకరించారు. ఈ సందర్భంగా శాన్వి చెలూరి, సహస్ర ,సజయ్ తేరుపల్లి శ్రీలికిత్ ని మ్యాచ్ పాయింట్ చైర్మన్, హెడ్ కోచ్ వేణు ముప్పాల భవిష్యత్తు లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని ఆశీర్వదించారు… వేణు ముప్పాల మాట్లాడుతూ బ్యాడ్మింటన్ లో అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వాళ్ళకి సరైన కోచింగ్ ప్రోత్సాహం ఇవ్వాలి అని సూచించారు. రోజు కి 6 నుండి 8 గంటలు ప్రాక్టీస్ చేస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు..అప్పుడే మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని దానికి ఉదాహరణ మ్యాచ్ పాయింట్ క్రీడాకారులే అని తెలిపారు…ప్రొఫెషనల్ గా మీ పిల్లలు బ్యాడ్మింటన్ నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ లో మీ పిల్లలను పంపించండి అని కోరారు. నిష్ణాతులైన కోచ్ లు ఉన్నారని అందరూ కూడా ఎన్.ఐ.ఎస్ చేసిన వాళ్ళు, మంచి అనుభవం ఉన్న కోచింగ్ టీమ్ మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ లో ఉన్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో నేషనల్ ప్లేయర్ కరీమ్,మంజుల, అంతర్జాతీయ క్రీడాకారుడు లింగేశ్వర రావు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..