

నాగోల్. మన న్యూస్ ;- ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం..సమాజసేవకులు,మార్గదర్శకులు,మానవతావాది, ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53 వ జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాగోల్ లో వారి కార్యాలయంలో రక్తదానం ఏర్పాటు చేసిన శిబిరంలొ ఉప్పల శ్రీనివాస్ గుప్త తనయులు రక్తదానం చేయడం జరిగింది.
ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసే రక్తదాతలకు ప్రశంస పత్రాన్ని,అభినందన జ్ఞాపికను ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ హైదరాబాద్,రంగారెడ్డి మేడ్చల్ కమిటీ,యువజన విభాగం సభ్యులు రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు
