

మన న్యూస్, నారాయణ పేట :-మత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్లోని భావించి వారు ఆక్రమంగా తరలిస్తున్న ముడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్టు మద్దూరు ఎస్ఐ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ యజమానులు మలప్ప, కేశవులు, కృష్ణప్ప ల పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైన అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.