

మన న్యూస్, వెదురుకప్పం : అమరావతిలో నిర్వహించనున్న అమరావతి రాజధాని పునఃప్రారంభ సభకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వెదరుకుప్పం నుంచి ముఖ్య నాయకుల బృందం ఈ రోజు అమరావతికి బయలుదేరింది.ఈ బృందంలో మండల తాహసిల్దార్ బాబు, వెదరుకుప్పం టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జి మోహన్ మురళి, గంటావారిపల్లి సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కుమార్, నవీన్, తిరుమలయ్య తదితరులు ఉన్నారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు, ప్రధానమంత్రికి అద్భుత స్వాగతం కల్పించేందుకు ఈ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరిస్తున్నారు.రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ హాజరుకానుండటంతో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రాభివృద్ధిపై స్పష్టత, భవిష్యత్తు దిశపై దృఢ సంకేతాలు అందిస్తుందని నాయకులు ఆశిస్తున్నారు. ఈ సభతో ప్రజల్లో నూతన ఆశాజ్యోతి వెలిగనుందని, పార్టీ భావజాలాన్ని ప్రజల మధ్య వ్యాప్తి చేయడంలో ఇది కీలక ఘట్టంగా మారనుందని చెబుతున్నారు.వెదరుకుప్పం సహా అనేక గ్రామాల నుంచి కార్యకర్తలు అమరావతికి తరలి వెళ్తున్నారు. రేపటి సభలో భారీగా ప్రజలు హాజరవుతారని అంచనా. ఈ సభ రాష్ట్ర రాజకీయాలకు మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
