

ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వనజ
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- నిరుద్యోగ దివ్యాంగుల కు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు. గురువారం గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామంలో ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ సూచన మేరకు నెల్లేపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన వనజా కు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో భాగంగా త్రీ వీలర్ బైక్ ,పెన్షన్ ను అందజేయడం జరిగిందని శ్రీధర్ యాదవ్ తెలిపారు.. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఎస్సీ ప్రకటన వల్ల డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వారందరికీ చాలా ఆనందంగా ఉందని అన్నారు.తాను ఎక్కడ తిరగడానికి వీలు లేక ఉన్నానని స్థానిక నాయకుల ద్వారా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ తెలుసుకొని బైక్ ను అందజేశారు. తనకు బైక్ సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ , డాక్టర్ వి.ఎం థామస్ కు స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ , సర్వేయర్ మధు, పంచాయతీ అధికారులు, పాల్గొన్నారు.
