

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఏన్ ఫోర్స్ మెంట్ టీం -3 ఓఎస్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి యాసంగి సీజన్ లో సన్నారకం క్వింటాలుకు రూపాలు 500 చొప్పున బోనస్ చెల్లిస్తూ ఉండడంతో విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి వెంట డిఎస్పి శేఖర్ రెడ్డి,ఇన్ ఫోర్స్ మెంట్ డీటీలు సురేష్ ,సిఐ, ఎస్ఐ,అచ్చంపేట్ సొసైటీ సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.