రైతు సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. రైతు సేవ అధికారి ఎం నాగరాజు

మన న్యూస్; వైయస్సార్ కడప: సిద్ధవటం: ఏప్రిల్ 8 బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం , రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది.క్షేత్ర పర్యటన చేసి రైతుల సందేహాలను నివృత్తి చేయడం ,ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ – రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియ ను తనిఖీ చేసి సొంత భూమి కలిగిన ప్రతి రైతు కు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరడం జరిగింది.పసుపు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఎండిన క్వింటాల్ పసుపు కొమ్ములు రూ.10000/- కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు.పొలం లో నూర్పిడి చేస్తున్న పసుపు లో దుంప కుళ్ళు తెగులు గమనించడం,అది వ్యాప్తి చెందకుండా సాఫ్ పౌడర్ ను కుప్పల మీద చల్లాలి అని తెలిపారు.జూలై మొదటి వారం లో నాటేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ది చేసుకొవాలి. ట్రై కోడేర్మ విరిడి, బావి స్టి న్, డై థీన్ఎం 45 అనే తెగుళ్ల మందును వాడుకొని విత్తన శుద్ది చేసుకొవాలి.అలాగే పంట మార్పిడి కూడా చేపట్టాలి. రైతులు సాగు చేస్తున్న జనుము పంటను పరిశీలించి భూసార వృద్ధికి జనుము సాగు ప్రాధాన్యత వివరించటం ఒకే విత్తనము కాకుండా నవధాన్యాలు సాగు చేస్తే సుస్థిర భూసారాన్ని తద్వారా భూమి లోపల పొరల్లో ఉన్న అతి పెద్ద జీవ వైవిధ్యమును కాపాడ వచ్చు అని తెలిపారు.జీలుగ,జనుము, పిల్లి పెసర కలిపి కూడా పచ్చి రొట్ట ఎరువుగా వాడవచ్చు.అనంతరం నువ్వుల పంట సాగు దిగుబడుల,మార్కెట్ ధర గురించి ఆరా తీయడం జరిగిందని ఎకరాకు 3.50 క్వింటాల్ నుండి 5.50 క్వింటాల్ వరకు ఉందని మార్కెట్ ధర క్వింటాల్ కు రూ.12000/హ రైతులు తెలిపారు.అనంతరం మోదీన్ సాబ్ పల్లి గ్రామము లో దోస పంటను పరిశీలించి రైతులతో చర్చించడం జరిగింది.ఆదర్శ మహిళా రైతు శ్రీమతి దండే లక్ష్మీ కాంతమ్మ 5 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్న ఉద్యాన పంటలు మామిడి,జామ, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్,అంజూరా, ఖర్జూర, లిచ్చి, సీతాఫల్, రామ్ ఫల , అల్ల నేరేడు, చీనీ, నానో,సీమ ఉసిరి, వాక్కయ, వాటర్ యాపిల్ మొదలైనవి) అంతర పంటగా వేరుశనగ సాగు చేశారు.నూతన సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించుట కు ఆసక్తి చూపడం జరిగింది..వ్యవసాయ, అనుబంధ జీవనో పాదుల గురించి వివరించడం జరిగింది.రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని సుస్థిర ఆదాయం పొందేలా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రైతులు ఒంటిమిట్ట వెంకటేశు, అన్నిక దేవదాసు, వెంకట సుబ్బారెడ్డి,రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు బొగ్గిడి సందీప్, సింహ యాదవ్, ఝాన్సీ, ప్రేమ్, సందీప్ పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్