

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం సేకరణ కేంద్రాలను ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం నాడు ప్రారంభించారు.
16 రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన 8 క్లస్టర్లలో శాసన సభ్యులు వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ఎంపీపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి మాట్లాడుతూ
రబీ సీజన్ లో కనీస మద్దతు ధర సాధారణ రకానికి100 కేజీలకు మద్దతు ధర రూ.2300,
75 కేజీలకు రూ.1725, గ్రేడ్ – ఏ రకానిక100 కేజీలకు రూ2320,75 కేజీలకు రూ 1740/- గా నిర్ణయించడం జరిగిందని ఆమె తెలిపారు.తేమ శాతం17% లోపు ఉండేలా ఆరబెట్టాలి అని తెలిపారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందిని వినియోగించుకుని కేవలం రెండు రోజులలో కనీస మద్దతు ధర పొందగలరని తెలిపారు.ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు సూతి బూరయ్య,జ్యోతుల పెద్దబాబు, మండల తహశీల్దార్ టి.ఆనంద్ కుమార్, మండలంలోని అన్ని గ్రామాల
సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామ కార్యదర్శులు,గ్రామ రెవెన్యూ అధికారులు,రైతు సేవా కేంద్ర ఇంచార్జ్ లు,సొసైటీ సిబ్బంది,ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది రైతులు పాల్గొనడం జరిగింది.