

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
ఇటీవల పుల్లలు నరికాడంటూ రాజవొమ్మంగి ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ సుమారు 15 రోజులు ఫారెస్ట్ అధికారులు తిప్పిన సింబోతుల రామకృష్ణ గత నెల 26న కనబడకపోవడంతో అతని భార్య గిరిజన మహిళ లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో ఫారెస్ట్ అధికారులు అదే రోజు సాయంత్రం తన ఇంటికి వెళ్లి రామకృష్ణ భార్యతో బలవంతపు సంతకాలు చేయించుకున్నారని ఆమె నా భర్తను ఫారెస్ట్ అధికారులే కిడ్నాప్ చేశారంటూ అదే రోజు రాత్రి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు వస్తే మరుసటి రోజు తనకు రసీదు ఇచ్చిన సంగతి పలు పత్రికలలో వచ్చింది.దీనిని పరిగణంలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం నుండి ఓ పాంప్లెట్ మర్రివీడు పంచాయతీ పరిమితడక చుట్టుపక్కల గ్రామాలలో పంపిణీ చేస్తున్నట్లు పలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో అసలు రామకృష్ణ ఏమయ్యాడు అనే సందిగ్ధంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే పోలీసులు పంచి పెడుతున్న పాంప్లెట్లో సింబోతుల రామకృష్ణ కనబడుటలేదు అతని ఆచూకీ తెలిసిన వారికి 10 వేల రూపాయలు పారితోషకం ఇచ్చి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని పాంప్లెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.ఈ కోవలో అసలు సింబోతుల రామకృష్ణ ఉన్నారా,ఏమైనా అయ్యారా ఈ గందరగోళం ఎప్పటిలోగా ముగుస్తుంది అనే సందీప్తలో పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.