

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ 33 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తోట వీర రాఘవులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి స్థానిక జడ్పిటిసి నీరుకొండ రామకుమారి,ప్రముఖ వైద్యులు గోపి శ్రీనివాస్,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు విభాగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా సరస్వతి శిశు మందిర్ లో విద్యనభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు సమాజము పెద్దలపట్ల గౌరవ మర్యాదలతో మెలుగుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో కే వెంకట అప్పాజీ,ఎం సుబ్రహ్మణ్యం,మట్టే శ్రీనివాసరావు,బర్రె కోటేశ్వరరావు,శ్రీరామ్, పలువురు గ్రామ పెద్దలు పాఠశాల అధ్యాపకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.