ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొనింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, మరి కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతుందన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది. ఇక, రేపు (మార్చి 22) కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా.. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారవణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి (మార్చి 23) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పుకొచ్చింది. అయితే, ఓవైపు ఎండలు.. మరోవైపు వర్ష సూచనతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించనుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర కోస్తాలో ఈరోజు పొడి వాతావరణమే ఉండగా.. రేపు, ఎల్లుండి మాత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరి కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది.

Related Posts

ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…

హిందీకి వ్యతిరేకంగా పోరాడండి.. తమిళ భాషను కాపాడుకోవాలి – డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్

Mana News :- కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా, ఈ వివాదంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి పేరుతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి