వాలంటీర్ల కొనసాగింపు పై కీలక పరిణామం..!!

Mana News :- ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై ప్రభుత్వం మరో సారి స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా, వైసీపీ ప్రభుత్వం అసలు వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని.. విధు ల్లో లేని వాలంటీర్లను ఎలా కొనసాగిస్తామని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం పైన శాసన మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టత ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ :- వైసీపీ హయాంలో మొదలైన వాలంటీర్ల వ్యవస్థ పై 2024 పైన పెద్ద వివాదామే చోటు చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని.. వారి వేతనం రూ 10 వేలకు పెంచుతా మని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తోంది. ప్రభుత్వ సర్వేల నిర్వహణ బాధ్యతలను సచివాలయ సిబ్బందికే అప్పగిం చారు. దీంతో, కొంత కాలంగా వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు విధుల్లో అవకాశం ఇవ్వాలని వినతి పత్రాలు సమర్పించారు. కూటమి నేతల హామీ :- కాగా, ప్రభుత్వం అసలు వైసీపీ హయాంలోనే వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్ చేయలేదని .. మనుగడ లోని వ్యవస్థ కొనసాగింపు… వేతనాల పెంపు ఎలా సాధ్యమని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం పైన పలు సందర్భాల్లో అసెంబ్లీలోనూ ప్రస్తావనకు వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తోంది. ఇక, ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాలంటీర్ల అంశం పైన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. కూటమి అధికారంలోకి వచ్చాక 2,56,000 మంది వాలంటీర్లను తొలగించారని మండిపడ్డారు. ఇవాళ వలంటీర్ వ్యవస్థనే లేదని మంత్రి చెప్పడం వలంటీర్లను మోసం చేయడమేనని విమర్శించారు. డ్యూటీ చేయించారు :- 2024 సెప్టెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లతో ఎలా డ్యూటీ చేయించారని నిలదీశారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా మరో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి స్పందించారు. వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం ేసారు 2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని చెప్పటం సరి కాదన్నారు.ఈ వ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ప్రశ్నించారు. 2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని నిలదీశారు. జీతం పెంచగానే చించినాడా పుతరేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. 2.60 లక్షల మందిని తొలగించడం అన్యాయమని, వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. మనుగడలో లేదు :- వాలంటీర్ల వ్యవస్థ మనుగలో లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. లేని వారిని ఎలా వరదల్లో వినియోగించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. వాలంటీర్లు గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదనలు ఉత్పన్నం కాదని స్పష్టం చేసారు. వాలంటీర్లపై వైసీపీ నేతలు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఏటా రెన్యువల్ చేసిందని వివరించారు. పర్మినెంట్ గా ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. వాలంటీర్లపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ది ఉంటే వారిని ఎందుకు పర్మినెంట్ గా తీసుకోలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం క్లారిటీ :- పాము తన పిల్లలను తాను చంపుకుని తిన్నట్లుగా వాలంటీర్లను వైసీపీ మోసం చేసిందని మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. 2023 ఆగస్టు వరకు మాత్రమే వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని సభలో వివరించారు. 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉం డి ఉంటే రెన్యవల్ చేద్దామనుకు న్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందే వైసీపీ వారు వాలం టీర్ల తో రాజీనామాలు చేయించారని గుర్తు చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చే సరికి వాలంటీర్లు విధుల్లో లేరు.. అందువల్లే రెన్యువల్ చేయలేదని స్పష్టం చేసారు. వాలంటీర్లపై వైసీపీ వారికి ప్రేమ ఉంటే శాశ్వతంగా విధుల్లో ఎందుకు నియమించలేదో చెప్పాలని డిమాండ్ చేసారు.

Related Posts

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 23 :- వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లో జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ….. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు…

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

  • By APUROOP
  • April 24, 2025
  • 4 views
కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..