విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే.. పూర్తిగా సహకరిస్తాం: సీఎం చంద్రబాబు

Mana News :- విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్‌ డాక్యుమెంట్‌ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తాం అని, ప్రతి ఒక్కరిని విజన్ 2047లో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతీ ఏడాది 15 శాతం గ్రోత్ రేట్ ఉండాలని, వికసిత్‌ భారత్‌ -2047 కల్లా దేశం 30 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. ఆనాడు హైదరాబాద్‌ను విజన్ 2020 పేరుతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో హైదరాబాద్‌ నంబర్ వన్ అయిందని సీఎం చెప్పారు. విజన్‌-2047 డాక్యుమెంట్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ‘విజన్ 2047పై గత ప్రభుత్వంలో ధ్వసమైన రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టగలిగాము. గతంలో నేను విజన్ 2020 తీసుకు వచ్చా. ప్రస్తుతం విజన్ 2047 ప్రధాని మోడీ అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా అభివృద్ధి సాధించేందుకు స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేస్తున్నాం. ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ నియోజకవర్గాల వారీగా కూడా విజన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 శాతం గ్రోత్ రేట్ ఉండాలి. సమర్ధవంతంగా ప్లానింగ్ ఉంటే సాధిస్తాం. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకనామిగా మారటమే లక్ష్యం. అలాగే రూ.308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశాం. ప్రతీ ఏటా రూ.15 శాతం వృద్ధి రేటుతో రూ.55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నాం. మొత్తంగా జీఎస్డీపీ 18,65,704 కోట్ల మేర, తలసరి ఆదాయం 3.47 లక్షల లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..