

గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ ;-ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిన త్యాగశీలి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా.. గొల్లప్రోలు శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి వారి యొక్క గొప్పతనాన్ని త్యాగనిరతని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణం త్యాగం చేసిన వారి యొక్క గొప్ప జీవిత చరిత్రను మన ఆర్యవైశ్యులందరికీ తెలియజేసి వారి యొక్క గొప్పతనాన్ని మన తర్వాతి తరానికి కూడా తెలియజేయాలని కూడా పెద్దలందరూ ప్రసంగించినారు..ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు వాసవి ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దర్శిపూడి సురేష్ సెక్రటరీ కేదారిశెట్టి వివి చలపతిరావు ట్రెజరర్ వూర శ్రీనివాసరావు కొత్త గణేష్ రావు దంగేటి రామకృష్ణ గ్రంధి జానకీ బాబు కేదారిశెట్టి పాపయ్య రాజు కంకటాల శ్రీనివాసు మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు.
