

Mana News :- హైదరాబాద్: కాసులకు కక్కుర్తి పడి కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు స్వయంగా తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవడంతో వారంతా కటకటాలపాలయ్యారు.తాజాగా, యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. బెట్టింగ్ యాప్ లతో ఎంతో మం ది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ ఏదో సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను కూడా ఈ బెట్టింగ్ దెబ్బతీస్తోందని సజ్జనార్ వ్యాఖ్యానించారు. అసలు ఏం ఉద్ధరించారు వీళ్లు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమాజహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్లను రిపోర్టు చేయండి. ఎవరైనా బట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోతే సమీపంలోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ ప్రజలకు సూచించారు.
