వరికుంటపాడు, ఫిబ్రవరి 13, మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ).
వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలోని పలు కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవడంతో విషయం తెలుసుకున్న యువనేత మారినేని రామకృష్ణ ఆయా కుటుంబాలకు నేరుగా వెళ్లి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేస్తుందని తెలియజేసి వారి ద్వారా సంబంధిత ధ్రువపత్రాలు సేకరించి దగ్గరుండి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కొరకు స్థానిక గ్యాస్ ఏజెన్సీ ప్రోప్రైటర్ ఓబయ్య దృష్టికి తీసుకొని వెళ్లి దగ్గరుండి నమోదు చేయించి మంజూరు చేయించారు. అనంతరం యువనేత మారినేని రామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా యువ నేత మార్నిని రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేదలు పేద బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఇప్పటికి గ్యాస్ కనెక్షన్లు లేక కట్టెల పొయ్యితో ఇబ్బంది పడటం గమనించానని విషయం తెలుసుకొని వారి దృష్టికి పథకం యొక్క వివరాలు తెలియజేసి నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించి అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహాయ సహకారాలతో గ్రామంలోని ప్రతి పేదవానికి అవసరమైనటువంటి పథకాలను గుర్తించి ఆయా పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని ప్రజలతో నిత్యం మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ , ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయటం జరుగుతుందని తెలిపారు. గత పాలకులు కేవలం కొంతమందికే పథకాలు పరిమితమయ్యేయని కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో గ్రామంలోని ప్రజలందరూ సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో గ్రామంలో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందించడానికి తమ వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మా యొక్క ప్రయత్నానికి అన్నివేళలా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
