అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు

Mana News :- అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్ వి వి మూవీస్ బ్యానర్ పై ఆర్ వి వి సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మన్యం ధీరుడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ అవుతుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో సినీ హబ్ గా విశాఖను మారుస్తామని దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశామని అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు పాత్ర చేసినటువంటి ఆర్ వి వి సత్యనారాయణ గారిని ఎంతగానో కొనియాడారు. ఇలాంటి చిత్రాలు ప్రస్తుత జనాలకి ఎంతైనా ఉపయోగకరమని ఇది కచ్చితంగా చూడదగ్గ సినిమా అని చెప్పుకొచ్చారు. అనంతరం నిర్మాత, హీరో ఆర్ వి వి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమా కోసం కత్తి యుద్ధం విలువిద్య లో శిక్షణ తీసుకున్నానని, ట్రెడిషర్లకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన విరోచిత పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ కావడంతోపాటు ఓటీటి ప్లాట్ ఫామ్ లో కూడా అదే సంస్థతో ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, డైరెక్టర్ యాద కుమార్, జి ఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు