

మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం పుత్తూరు కార్యాలయంలో యువత పోరు/ ఫీజు పోరు పోస్టర్లను ఆమె స్థానిక నాయకులతొ కలిసి ఆవిష్కరించారు. వైసీపీ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృపా లక్ష్మి కోరారు.
