

Mana News, S R Puram :- గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శ్రీరంగ రాజపురం మండలం మంగుంట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపాలక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, గ్రామస్తులు కృపా లక్ష్మికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కృపా లక్ష్మికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి,స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ సరిత జనార్ధన్, మండల అధ్యక్షులు మనీ, సర్పంచ్ రూప శేషాద్రి, నాయకులు చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు, కుప్పయ్య, సర్పంచుల సంఘ అధ్యక్షుడు దిలీప్ రెడ్డి, యూత్ కార్యదర్శి సాంబ, సుధా, కోటిరెడ్డి బాబు, మహేష్, ఏకాంబరం, బాబు, ముత్యాలు, గోవిందస్వామి, దొరస్వామి, ఎంపీటీసీ సిద్దయ్య, అశోక్, అమృత రాజ్, ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
