

Mana News :- అమరావతి: ప్రత్తిపాడులో సీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల జనసేన పార్టీ ఇన్‌ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు తీరు పట్ల ఆ పార్టీ తీవ్రంగా స్పందించిది. జనసేన నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ”ప్రత్తిపాడు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జి తమ్మయ్య బాబును అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. సీహెచ్‌సీ ఘటనపై అందిన నివేదికను, వివరణలను పరిగనణలోకి తీసుకున్నాం. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడటం దురదృష్టకరం” అని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు.
