ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం- ఉల్లాసంగా ఉత్సాహం గడిపిన వైనం గురువులను సన్మానించి ఆశీర్వచనాలు తీసుకున్న పూర్వ విద్యార్థులు

తవణంపల్లి, మార్చి 9 మన న్యూస్

మండలలోని అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985 – 86:వ సంవత్సరం 10 వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు యాగమూర్తిపిళ్ళై, ఎల్ కృష్ణారెడ్డి సుందరరాజులు, జగత్ జ్యోతిశ్వరరెడ్డి, వెంకటస్వామి, బాబుసాహెబ్, కృష్ణమూర్తినాయుడు, రాజేశ్వరి, లోకేశ్వరి, శ్రీదేవి, మొగిలమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు యాగమూర్తిపిళ్లై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను బాగా చూసుకున్న రోజే వారి చదువులకు సార్థకత అవుతుందన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెడుదారి పట్టకుండా చదివించుకుని, వారి అభివృద్ధికి పాటు పడాలన్నారు. ముఖ్యంగా తమ పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలువురు పూర్వ విద్యార్థులు ప్రసంగించారు. 39 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపడం సంతోషాన్నిస్తోందన్నారు. అదే క్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఎదిగేందుకు అన్ని విధాల సహకరించిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం మరింత ఆనందాన్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి కోరిక మేరకు పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సాయం చేస్తామని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు చివరగా కార్యక్రమానికి హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులను దృశ్యాలవులతో ఘనంగా సన్మానించి కానుకలు అందజేశారు. అంతకుముందు ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేసి నా పూర్వ విద్యార్థులు ఒకరు ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ గత స్మృతులను నెమరువేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు కేబీ ఉమాపతి, పి రామకృష్ణ, ధర్మేంద్ర, జయంతిరెడ్డి, మన్నారు ప్రసాద్, కుమార్ నాయుడు, రెడ్డిప్రసాద్, మాధవి, కమలాపతి, సుకుమార్, పూర్ణచంద్ర, శ్రీనివాసులుతో పాటు దాదాపు 200 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ