

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ప్రజలకు 24 గంటలు అదుబాటులో వుండే విభాగాలలో ఒకటైన విద్యుత్ శాఖలో అత్యధిక ప్రతిభ కనభరిచిన అధికారులకు విద్యుత్ శాఖ ఉన్నాధికారులు అవార్డు ప్రతిభాపత్రాలు అందజేసారు.మార్చి4 న లైన్ మెన్స్ డే సందర్భంగా జగ్గంపేట డివిజన్ విద్యుత్ కార్యాలయం నందు లైన్ మెన్స్ డే ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామం విద్యుత్ శాఖ లో లైన్ మెన్ గా బాధ్యతలు చేపడుతున్న కుంచె సింహాచం ఉత్తమ లైన్ మెన్ అవార్డు అందుకున్నారు.జగ్గంపేట డివిజనల్ ఇంజనీర్,వీరభద్రరావు,అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రాజశేఖరం,ఏలేశ్వరం ఏ ఈ.జి సూర్యనారాయణల చేతుల మీదుగా ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని లైన్ మెన్ కుంచె సింహాచలముకు అందజేశారు. ఈ సందఠరేగా డి ఈ వీరభద్రరావు డివిజన్ పరిధిలో వున్న లైన్ మెన్ లకు లైన్ మెన్స్ డే శుభాంక్షలు తెలిపారు.అవార్డు గ్రహీత సింహాచలం మట్లాడుతూ ఉత్తమ లైన్ మెన్ గా ఎంపిక చేసి అవార్డు అందించిన, డి ఈ, వీరభద్రరావు,ఏ.డి.ఈ, రాజశేఖర్, ఏ ఈ సూర్యనారాయణ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందిచిన గౌరవం నా బాధ్యతను ఇంకా రెట్టింపు చేసిందని అన్నారు. నిరంతరం విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సకాలంలో సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.