

Mana News :- తిరుపతి జిల్లా గూడూరురైల్వే స్టేషన్లో సమస్యలను పార్లమెంట్ లో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కి గూడూరు వైసీపీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. గూడూరు రైల్వే కేంద్రం గా రోజూ వేలాది మంది ప్రయాణికులతో నిమ్మ,మామిడి ఇతర పంటలు వాణిజ్యపరంగా ఎగుమతులు చేస్తూ,100 గ్రామాల ప్రజలకు ఏన్నోవిదాలుగా వుపయోగపడే జంక్షన్ కెంద్రం అని సవినయంగాతెలియజేస్తూన్నామని తెలిపారు.గూడూరు రైల్వే జంక్షన్‌లో రైళ్లు స్టాపింగ్ ,ఇతర అవసరాలు పరంగా సౌకర్యాలు లేకప్రయాణికులు,వాణిజ్యఅవసరాలు తీర్చుకొనేవారు ఎన్నో ఇబ్బందులు పడుతూన్నారు. తూర్పు గూడూరు నుంచి పడమర గూడూరువెళ్లేప్రయాణికులు,నెల్లూరు వైపు వున్న అండర్ బ్రిడ్జి చాలా ఇరుకుగావున్నందునరెండు,మూడు,నాలుగు చక్రాల వాహనదారులప్రయాణికులకు చాలా ఇబ్బందులు పడుతూన్నారని, ఆ బ్రిడ్జి ని వెడల్పు చెయాలనిఎంతోమంది రైల్వేఉన్నతాధికారులకు,పట్టణంలో పలువురు వ్రాతపూర్వకంగా తెలిపివున్నారు.ఈదినం వరకు ఎవ్వరు పట్టించుకొన్న దాఖలాలు లేవు అని సవినయంగా తెలియజేస్తున్నాము.తమరు వెంటనే ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈఅండర్ బ్రిడ్జిని వెడల్పుచెసి రెండు,మూడు,నాలుగుచక్రాల వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కొరుతూన్నాము.అలాగే రైల్వేస్టేషన్‌లో మొదటి ఫ్లాట్‌ఫారంలో దక్షణంవైపు ఫుట్‌ఓవర్‌బ్రిడ్జికి లిఫ్ట్‌లేదు,లిఫ్ట్‌సౌకర్యం కల్పించాలి.మూడు,నాలుగు,ఐదు ఫ్లాట్‌ఫారంలకు షెల్టర్స్‌లేక ప్రయాణికులు ఎండకు ఎండి ,వానకు తడుస్తూన్నారు.ఈమూడు ఫ్లాట్‌ఫారంలల్లో వెంటనే షెల్టర్లు ఏర్పాటుచేయాలని కొరుతూన్నాము.అలాగేపడమరవైపు వున్న టికెటుకౌంటరుకు ఐదవనెంబరు ఫ్లాట్‌ఫారంకు మద్య రోడ్డు లేనందున ప్రయాణికులుచాలా ఇబ్బంది పడుతూన్నారు.రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఏంతో సౌకర్యంగా వుంటుంది. చెన్నై వైపు రెండవ ఫ్లాట్‌ఫారంపై ఎస్కలేటరు ఏర్పాటు చేయాలి.అలాగే రైళ్లు స్టాపింగ్ పరంగా కాకినాడ నుంచి తిరుపతికి వెళ్లే ట్రైన్‌నంబరు..17250 ఏక్స్‌ప్రెస్‌ట్రైన్, తిరుపతి నుంచి కాకినాడవెళ్లేట్రైన్‌నంబరు..17249 ఏక్స్‌ప్రెస్ ట్రైన్ చిన్నస్టేషన్‌లో కూడ ఆగుతుంది కాని గూడూరు జంక్షన్‌లో అగటంలేదు.తమరు చొరవతీసుకొని ఈట్రైన్‌గూడూరులో నిలుపుదలచేయాలి అని కోరుతున్నాము.తిరుపతి,నెల్లూరు మధ్య పాస్టుపాసింజరు ఉదయం, మధ్యాహ్నం, సాయింత్రం సమయాల్లో ఏర్పాటు చేస్తే వెంకటేశ్వరస్వామి వారిని,వుద్యోగస్థులకు,ఇతర ప్రయాణికులకుఏంతో ఉపయోగం వుంటుంది.బోకోరో నుంచి చెనై వెళ్లే బొకొరో ఎక్స్‌ప్రస్ గూడూరులో అపాలని కొరుతూన్నాముఅని గూడూరు పట్టణానికి చెందిన వైస్సార్సీపీ నాయకులూ వేగూరు భరత్ రెడ్డి ,sk షాను ,నవీన్ కుమార్ మంగళవారం తిరుపతిలో యం పి గురుమూర్తి ని కలిసి వినతి పత్రం ఇచ్చారు.యం పి గురుమూర్తి పై సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను అని వారికి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.