

మనన్యూస్,నారాయణపేట:ఆత్మకూరు పట్టణంలోని బాబా కాలనీలో టీఎన్జీవో బిల్డింగ్ పక్కన ఉన్న 20 ఫీట్ల రోడ్డుపై ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు శనివారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కే విజయ రాములు మాట్లాడుతూ,20 ఫీట్ల రోడ్డుకు అడ్డంగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్న మాజీ ఎంపీపీ బంగారు శ్రీను పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.బాబా కాలనీలో నిర్మించిన వెంచర్లలో 10% ల్యాండ్ పూర్తి వివరాలు ఇవ్వాలని,ఆత్మకూరు పట్టణంలో అనేక వెంచర్లలో ఉన్న10% ల్యాండ్ కమ్యూనిటీ పర్పస్ కోసం ప్రజల అవసరాల కోసం10% ల్యాండ్ వెంచర్లలో తప్పనిసరిగా ఉండాలని అది మున్సిపాలిటీ పరిధిలో అప్పటి గ్రామపంచాయతీ,ఇప్పటి మున్సిపాలిటీ పరిధిలో ఉండాలని పంచాయతీ చట్టాలు చెబుతున్నాయని అన్నారు.ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల చేతులకు అసైన్మెంట్ నెంబర్లు ఇచ్చి మున్సిపల్స్ కమిషనర్లు తీపివోలు పర్మిషన్లు ఇచ్చి 10% ల్యాండ్లను కబ్జా గార్ల చేతుల్లో పెట్టారని అన్నారు. కాబట్టి వెంటనే అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల సహాయ కార్యదర్శి కే మోష, అమరచింత మండల కార్యదర్శి అబ్రహం,భాస్కర్ ఏఐవైఎఫ్ నాయకులు ఎండి కుతుబ్,సిఎన్ శెట్టి,రవీందర్,శేఖర్,గీతమ్మ తదితరులు పాల్గొన్నారు.