

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీమంత్రి కురసాల కన్నబాబును ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ వైసిపి నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు శుక్రవారం కన్నబాబు నివాసంలో కన్నబాబును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మురళి రాజు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరాంధ్ర జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కన్నబాబు మరింత ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కన్నబాబు కాకినాడ
జిల్లాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసే జిల్లాలో వైసిపి పార్టీకి అన్ని విధాలుగా పార్టీని బలోపేతం. చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు, బొల్లు నాగేశ్వరరావు, పోకనాటి వెంకటేశ్వరరావు, జువ్వల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.