

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రంలో వైకాపా పార్టీకి పూర్వం వైభవం తీసుకొద్దామని వైసిపి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పార్టీ నేత శిడగం వెంకటేశ్వరరావు నివాసంలో ముద్రగడ గిరిబాబు నగర వైసిపి కౌన్సిలర్ల ను కలిశారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం మండలంలోని సి .రాయవరం, రమణయ్యపేట గ్రామాల్లో గిరిబాబు పర్యటించారు. గిరిబాబు వైసిపి కార్యకర్తలు నాయకులను కలిసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బదిరెడ్డి గోవింద్, సామంతుల సూర్య కుమార్, సుంకర రాంబాబు, సర్పంచ్ ములగపాటి సునీత రమేష్ రాజు, వాగు బలరాం, పైల విజయబాబు, కోరాడ ప్రసాద్, చందక జగదీష్, బి శెట్టి అప్పలరాజు, పైల చిన్న సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.