

మనన్యూస్,తిరుపతిఃమెడికల్ హబ్ గా తిరుపతిని తీర్చిదిద్దేంకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స పేదలకు అందించేందుకు ఆధునాతన వైద్య పరికరాలను దాతలు అందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.గురువారం ఉదయం రుయా ఆస్పత్రిలోని ఆర్ బి ఎస్ కే డిఈఐసిలో సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు.ఈ కేంద్రానికి ఎస్వీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో నవజాత శిశువులలో అంధత్వాన్ని నివారించేందుకు అవసరమైన 35 లక్షల విలువ చేసే పరికరాలను యూనిసెప్ అందించింది.దీంతో నవజాత శిశువులలో ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికత్సలు అందించేందుకు అవకాశం కలిగింది.అలాగే డిఈఐసి సిబ్బందికి సామర్థ్యం పెంపుపై శిక్షణను అందించనున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.శ్రీవేంకటేశ్వర స్వామి కృపకు నోచుకునే భక్తులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య పరికాలు అందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.తిరుపతిని వైద్య,విద్యా హబ్ గా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ జలాలేమ్,డిఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్,డాక్టర్ సంతోష్,డాక్టర్ రాజన్ శుక్లా,డాక్టర్ ప్రశాంత్,డాక్టర్ శ్రీధర్,ఎస్వీ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్,డిఈఐసి స్టాప్,ఏఎన్ ఎమ్ లు,సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.