

మనన్యూస్,కోవూరు:బుచ్చి పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారస్థులకు న్యాయం చేస్తా.బాలికల పాఠశాల వద్ద ఉదయం సాయంత్రం మహిళా పోలీస్ బీట్ ఏర్పాటు చేయండి.చెన్నూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో సహకరించండి.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
బుచ్చిరెడ్డి పాళెం పట్టణం చెన్నూరు రోడ్డు లోని ఆటో స్స్టాండ్ ను గిరిజ హాలు వద్దకు తరలించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహ కూడలిలోను అటు చెన్నూరు రోడ్డు వైపున రోడ్ మార్జిన్ వ్యాపారస్థులతో ఆమె మాట్లాడారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.అనంతరం బుచ్చి పట్టణ టిడిపి కార్యాలయం లోటస్ గ్రాండ్ లో చెన్నూరు రోడ్డులో తోపుడు బండ్ల పై పళ్ళు,కూరగాయలు అమ్ముకునే వ్యాపారాస్థులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రోడ్డు మార్జిన్ వెండర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్కెట్ విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన వారికి ఈ నెల 25 లోపు తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజను ఆదేశించారు.బుచ్చి పట్టణంలో బాలికల పాఠశాలల వద్ద ఉదయం 8 నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మహిళా కానిస్టేబుల్స్ తో స్పెషల్ బీట్ ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు.చెన్నూరు రోడ్డులో ఆటోలను నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు.బుచ్చి పట్టణంలోని రోడ్ మార్జిన్ వ్యాపారస్థులకు ఆర్‌టిసి తరలిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న అధికారుల సూచనల మేరకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆర్‌టిసి బస్టాండ్ ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతి ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ,వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి,నస్రీన్ ఖాన్,కౌన్సిలర్లతో పాటు టిడిపి అర్బన్ మరియు రూరల్ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, బత్తుల హరికృష్ణ,కోడూరు కమలాకర్ రెడ్డి,మోర్ల మురళి, వింజం రామానాయుడు పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.