మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:– మక్తల్ నియోజకవర్గంలో ని ఉట్కూర్, నర్వ మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదృతంగా ఎన్నికల ప్రచారన్ని రాష్ట్ర క్రీడ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరినిర్వహించారు. ఉట్కూర్ మండల కేంద్రం, పులిమామిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరపున ఉదయం నుండి ఇంటింట ప్రచారం జోరుగా సాగించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరీ మాట్లాడుతూ,ఉట్కూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులైన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఇప్పటికే వేలకోట్ల రూపాయలతో మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్ లను గెలిపించడం ద్వారా గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలియజేశారు. రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు, పేదవాడికి సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి అనేక పథకాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి స్వయం సంఘాలతో పెట్రోల్ బంక్ లు, ఆర్టిసి అద్దె బస్సులు నడిపిస్తున్నారని తెలిపారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నర్వ మండలంలోని కల్వాల్, శ్రీపురం, రాయికోడ్, రాచపల్లి, ఉందేకోడ్ లలో ఎన్నికల ప్రచారం లో విస్తృతంగా పర్యటించారూ. కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే ఆయా ఊర్ల అభివృద్ధికి బాటలు వేసిన వారమవుతామన్నారు. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను సర్పంచ్ గా, జడ్పీటీసీ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏదిగానని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఎంత ఎదిగినా నేను మీలో ఒక్కడినే అనే విషయం మరచిపోవద్దన్నారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా నా వద్దకే వచ్చి తెలుపొచ్చన్నారు మంత్రి. మూడో దశలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అన్నీ గ్రామాల్లో మంత్రి గారి పర్యటనకు ప్రజలు భారీ గా తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *