మనధ్యాసనిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాం తారావును నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించడం పట్ల ఎమ్మె ల్యేకు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు.వారి వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మల్లికా ర్జున్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి,పలు గ్రామాల సర్పంచులు ఉన్నారు.