యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-6: పదవ తరగతి విద్యార్థుల పరీక్షల తర్పీదు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వందరోజుల కార్యక్రమం పురోగతిని పరిశీలించేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డి.ఒ. పి. వీరేంద్ర ఈరోజు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, పరీక్షలపై సమగ్ర దృష్టి పెట్టాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమూల్యమైన సూచనలు అందించారు. హెచ్.యం.కం. ప్రిన్సిపాల్ ఎ. పి. లలిత మాట్లాడుతూ, ఎం.పి.డి.ఒ. సందర్శన పాఠశాల సిబ్బంది, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. అనంతరం ఎం.పి.డి.ఒ. వీరేంద్ర, ఉపాధ్యాయులు జె. భాస్కర్ రెడ్డి, కనకాచారి, చిట్టిబాబు, కె. భారతిలతో సమావేశమై మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధతో తర్పీదు అందించాలి, వారి భవిష్యత్తు మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సువర్ణ, వెల్ఫేర్ అసిస్టెంట్ కవితలు పాల్గొన్నారు. పాఠశాల వందరోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఎం.పి.డి.ఒ. పాఠశాల సిబ్బందికి స్పష్టం చేసినట్లు పాఠశాల వర్గాలు తెలియజేశాయి.






