జియ్యమ్మవలస/ గుమ్మలక్ష్మీపురం/ మనధ్యాస డిసెంబర్6
గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటకు చెందిన తులాల రవిగారి బావ-మరిది, సేనాపతి బాలకృష్ణ శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి శనివారం రోజున దివంగత బాలకృష్ణ స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బాలకృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించి, అనంతరం బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






