యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-5: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ను పండుగ వాతావరణంలో అత్యంత భవ్యంగా నిర్వహించినట్లు హెచ్‌.యం. ఎ.పి. లలిత తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధికార పార్టీ ప్రతినిధి వల్లేరు అమరనాధ నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న డోక్క సీతమ్మ మద్యాహ్న భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, తల్లికి వందనం వంటి పథకాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులలో విలువలు, క్రమశిక్షణ, సత్ప్రవర్తన పెంపొందితేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో స్టేజ్‌ ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులతో కలిసి సహకరిస్తానని అమరనాధ నాయుడు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష–ప్రధాన కార్యదర్శులు మొరార్జీ, రభీ, సింగిల్ విండో అధ్యక్షులు చిత్ర నాయుడు, స్పెషల్ ఆఫీసర్ రామచంద్ర, ఇన్‌చార్జి భాస్కర్ రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ నవీన్ కుమార్, సర్పంచ్ రాధా మురళి, నాయకులు వేణు నాయుడు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయ బృందం సందర్శించి ప్రశంసలు అందించారు. సమావేశం అనంతరం తల్లిదండ్రులకు పాఠశాల తరఫున భోజన వసతి ఏర్పాటు చేశారు. పండుగ సందడి మధ్య నిర్వహించిన ఈ పేరెంట్స్ మీటింగ్ విద్యార్థుల ప్రతిభను, పాఠశాల అభివృద్ధిని ప్రతిబింబించేలా సాగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *