కాణిపాకం మన ధ్యాస సెప్టెంబర్-27 భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవ పక్షత్సవాల క్రమంలో ఈరోజు కాణిపాకం పి.హెచ్.సి లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎం.కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా బిజెపి అధ్యక్షులు ఎస్.జగదీశ్వర్ నాయుడు హాజరయ్యారు. గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎం.ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి సి.జయచంద్రా రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సోప్ప చలపతి నాయుడు, పయని, జిల్లా నాయకులు శ్రీధర్ నాయుడు, సుజిత్ రెడ్డి, పూతలపట్టు మండలాధ్యక్షుడు ప్రసాద్, ఐరాల మండల ప్రధాన కార్యదర్శి సి.అశోక్, మండల ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, గోవింద్ రెడ్డి, పల్లి చిట్టిబాబు, బి.పరదేశి, మహిళా నాయకురాలు బుజ్జి, సీనియర్ నాయకులు మునీంద్ర ఆచ్చారి, బి.గిరి తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమానికి విశేష సహకారం అందించారు.







