

మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ
సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో సీజనల్గా వచ్చే వ్యాధులు శోకకుండా పశువులకు విధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ జగత్ శ్రీనివాసులు రైతులకు తెలిపారు. మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో మంగళవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిడి మాట్లాడుతూ వ్యాధులనుంచి పశువులను రక్షించుకోవాలంటే అన్ని రకాల టీకాలు చేయించాలని అన్నారు. టీకాల వల్ల పాలు తగ్గడం ఈసుకుపోవడం అవేమి ఉండదని రైతులకు సూచించారు. ప్రతి గేదెకు గాలికుంటు టీకాలు వేయాలని పశుసంవర్ధక సిబ్బందిని ఆదేశించారు. జీవాలకి టీకాలు తప్పనిసరిగా చేయించుకోవాలని గొర్రెల కాపరులకు వివరించారు ఈ కార్యక్రమంలో కొండేపి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం రవికుమార్ స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ నగల్ల హజరత్ మరియు మండలంలోని పశుసంవర్ధక సహాయకులు పాల్గొన్నారు.