

ఎరువులు పక్కదారి పట్టిస్తే చట్టపరంగా చర్యలు
ఎరువుల దుకాణ దారులకు పోలీస్ హెచ్చరిక
మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం తో రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు ప్రధానంగా యూరియా వంటి వాటి అక్రమ నిల్వలకు పాల్పడినా పక్కదారి పట్టించినా చట్టపరంగా చర్యలు తప్పవని సింగరాయకొండ పోలీస్ లు ఎరువుల దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. మంగళ వారం ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఎరువుల దుకాణాల ను ఎస్సై బి మహేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల నిర్వాహకులను అడిగి వారి దుకాణాల లో ఎరువుల నిల్వలు, ఎరువుల గురించి ఆరా తీశారు. షాపులు, ఇతర నిల్వ ప్రాంతాలలో ఉన్న ఎరువులు, రికార్డ్ లను పరిశీలించారు. సింగరాయకొండ పరిధిలో రైతులకు అందుబాటు లో ఉన్న అవసరమైన ఎరువులు ఎక్కడా నల్ల బజారుకు తరలించినా కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరమైన చర్యలకి గురికావాల్సి వస్తుందని పోలీస్ హెచ్చరించారు. ఎరువుల వ్యాపారులు మండల పరిధిలో రైతులకు సహకరించాలని అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎస్సై మహేంద్ర కోరారు.